రామవరంలో ఎలక్ట్రిక్ స్కూటీ దగ్ధం.. స్థానికుల అప్రమత్తత

కలం, ఖమ్మం బ్యూరో :  కొత్తగూడెం పట్టణ పరిధిలోని రామవరం గోధుమవాగు బ్రిడ్జి (Godhumavagu Bridge) సమీపంలో గురువారం ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కిరాణా దుకాణం ఎదుట నిలిపి ఉంచిన ఎలక్ట్రిక్ స్కూటీలో ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సదరు స్కూటీని షాపు ముందు పార్క్ చేసి ఉంచారు. ఈ క్రమంలో బ్యాటరీ విపరీతంగా ఓవర్‌హీట్ కావడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించినట్లు తెలిపారు.

మంటలను గమనించిన చుట్టుపక్కల ప్రజలు, వాహనదారులు వెంటనే అప్రమత్తమై నీళ్లు, ఇసుకతో మంటలను ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయినప్పటికీ క్షణాల్లోనే మంటలు వ్యాపించడంతో స్కూటీ పూర్తిగా కాలిబూడిదైంది. ప్రస్తుతం ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో బ్యాటరీ వేడెక్కడం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా ఈ-స్కూటర్ల యజమానులు వాహనాలను ఎండలో ఎక్కువసేపు నిలపకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>