కలం, వెబ్ డెస్క్: ఢిల్లీలోని కొన్ని ప్రధాన ప్రాంతాల్లో కోతుల బెడద (Delhi Monkey Menace) ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఢిల్లీ అసెంబ్లీ ప్రాంగణంలోకి కోతులు ప్రవేశించి హల్ చల్ చేస్తున్నాయి. ఈ సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టాలని ఢిలీ ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. కోతులను భయపెట్టేలా పెద్ద శబ్దాలను చేసే సిబ్బందిని నియమించనుంది. అధికారుల ప్రకారం.. అసెంబ్లీ కాంప్లెక్స్, చుట్టుపక్కల ప్రాంతాల్లో కోతుల సమస్య ఎక్కువగా ఉంది. విద్యుత్ వైర్లు, డిష్ యాంటెన్నాలపై దూకి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. అలాగే ఎమ్మెల్యేలు, సిబ్బందిని భయపెడుతున్నాయి.
ఈ సమస్యను పరిష్కరించడానికి పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (PWD) ప్రత్యేక శిక్షణ సిబ్బంది (లంగూర్) నియమించడానికి టెండర్లను పిలిచింది. దీంతో కోతులను భయపెట్టి తరిమివేయవచ్చు. అన్ని పని దినాల్లో ఈ సిబ్బంది పనిచేస్తుంది. ప్రతి వ్యక్తికి ఎనిమిది గంటల షిఫ్ట్ కేటాయించబడుతుంది. అసెంబ్లీ కార్యకలాపాల సమయంలో సిబ్బంది భద్రతా నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటూ కోతులను తరిమికొట్టనున్నారు. ఈ ప్రయత్నంతోనైనా ఢిల్లీ అసెంబ్లీలో కోతుల సమస్య (Delhi Monkey Menace) తగ్గుతుందో లేదో వేచి చూడాల్సిందే.
Read Also: స్క్రాప్ నుంచి సూపర్ బైక్.. ఇండియా స్టూడెంట్స్ ఇన్నొవేషన్ అదరహో!
Follow Us On: Sharechat


