కళాకారుల జీవితాలతో చెలగాటమా..? కాంగ్రెస్ పై హరీశ్ రావు ఫైర్​

కలం, వెబ్​ డెస్క్​ : కళాకారుల జీవితాలతో కాంగ్రెస్​ ప్రభుత్వం చెలగాటం ఆడడం మానుకోవాలని బీఆర్ఎస్​ ఎమ్మెల్యే హరీశ్​ రావు  (Harish Rao) అన్నారు. గురువారం రవీంద్ర భారతి ముందు డిమాండ్లు నెరవేర్చాలని కళాకారులు మంత్రి జూపల్లి కృష్ణా రావు (Jupally Krishna Rao) కి విన్నవించుకున్న సమయంలో ఆయన వ్యవహరించిన తీరుపై హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

నమ్మినోళ్లను నట్టేట ముంచడంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మించినోళ్లు లేరని హరీశ్ రావు ధ్వజమెత్తారు. అధికారంలోకి రావడానికి 1000 మంది కళాకారులకు ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ, మూడేళ్లు గడిచినా ఆ హామీ అమలు కాలేదని ఆయన విమర్శించారు. కళాకారులను కూడా దగా చేసిన దుర్మార్గపు ప్రభుత్వం అని మండిపడ్డారు. కడుపు మండిన కళాకారులు నిలదీస్తే.. సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.

ముఖ్యమంత్రి, మంత్రులు ఎన్నాళ్లు ఇలా తప్పించుకు తిరుగుతారు? అని ఆయన ప్రశ్నించారు. డైవర్షన్ రాజకీయాలు.. ఊక దంపుడు డైలాగులతో సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను ఇంకెన్నాళ్ళు మభ్యపెడతారని నిలదీశారు. కళాకారుల కన్నీళ్లు ప్రభుత్వానికి మంచిది కాదని హెచ్చరించారు. కళాకారుల జీవితాలతో చెలగాటమాడటం మానుకుని.. వారికి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని హరీశ్ రావు (Harish Rao) డిమాండ్ చేశారు.

Also Read : కాంగ్రెస్ అభ్యర్థులుగా ‘రెడ్డి’లకే ఛాన్స్.. స్పందించిన మల్లు రవి

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>