హైద‌రాబాద్ పోలీస్ శాఖ‌లో భారీ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌

క‌లం, వెబ్‌డెస్క్: హైదరాబాద్ పోలీస్ (Hyderabad Police) శాఖలో పరిపాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం భారీ పునర్వ్యవస్థీకరణ చేపట్టింది. ఇందులో భాగంగా నగరంలోని జోన్లు, డివిజన్లు, పోలీస్ స్టేషన్ల పరిధులలో మొత్తం 76 ప్రాంతాలలో కీలక మార్పులు చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సనత్‌నగర్‌తో పాటు మహేశ్వరం, శంషాబాద్ పరిధుల్లో సరిహద్దులను సవరించారు. ఇందులో భాగంగా ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ పేరును అధికారికంగా శంషాబాద్ పీఎస్‌గా మార్చారు. అలాగే మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొన్ని ప్రాంతాలను మల్కాజిగిరి కమిషనరేట్‌కు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ పునర్వ్యవస్థీకరణలో భాగంగా మహిళా రక్షణకు పెద్దపీట వేస్తూ ఉమెన్ సేఫ్టీ వింగ్ (Women Safety Wing) పరిధిలో ప్రత్యేక జోన్లను కేటాయించారు. నగరంలో పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా ట్రాఫిక్ నియంత్రణను మరింత పటిష్టం చేయడానికి ట్రాఫిక్ పోలీస్ శాఖ పరిధిలోని జోన్లు, డివిజన్లలో కూడా మార్పులు చేపట్టారు. సైబర్ నేరాలను సమర్థవంతంగా అరికట్టేందుకు వీలుగా జోనల్ సైబర్ సెట్ పరిధిని కూడా పునర్వ్యవస్థీకరించారు. ఈ సమగ్ర మార్పుల ద్వారా శాంతిభద్రతల పరిరక్షణతో పాటు నేరాల నియంత్రణ మరింత వేగవంతం కానుందని ఉన్న‌తాధికారులు భావిస్తున్నారు.

Also Read : కాంగ్రెస్ అభ్యర్థులుగా ‘రెడ్డి’లకే ఛాన్స్.. స్పందించిన మల్లు రవి

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>