వ్యక్తిగత విమర్శలు చేస్తే.. ఇదే ఆసుపత్రిలో చికిత్స ఇప్పిస్తాం: బీజేపీ నేతలు

కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన క్రిటికల్ కేర్ సెంటర్‌ (Critical Care Centre) పై మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి (Allola Indrakaran Reddy) అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని బీజేపీ నాయకులు సూచించారు. గురువారం ఆసుపత్రిలోని క్రిటికల్ కేర్ సెంటర్‌ను పరిశీలించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిర్మల్‌‌లో ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేకనే మాజీ మంత్రి విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే చొరవతో కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.23.74 కోట్ల నిధులతో అత్యాధునిక క్రిటికల్ కేర్ సెంటర్‌ను మంజూరు చేసిందన్నారు. క్రిటికల్ కేర్ సెంటర్ భవన నిర్మాణం పూర్తయిందని, దీనిని పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు.

సుమారు రూ.10 కోట్ల విలువైన వైద్య పరికరాలు, ఫర్నీచర్, ఇతర సదుపాయాలు సమకూర్చాల్సి ఉండగా, ఇప్పటివరకు ఒక్క పరికరం కూడా అందుబాటులోకి రాలేదని ఆరోపించారు. అధికార పార్టీలో ఉన్న మాజీ మంత్రి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి అవసరమైన నిధులు మంజూరు చేయించి క్రిటికల్ కేర్ సెంటర్‌(Critical Care Centre)ను పూర్తిస్థాయిలో ప్రారంభించేలా కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా వ్యక్తిగత విమర్శలు చేస్తే ఆసుపత్రిలో చికిత్స ఇప్పిస్తామని బీజేపీ నాయకులు హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రావుల రాంనాథ్, సాదం అరవింద్, జిల్లా ఉపాధ్యక్షులు సత్యం చంద్రకాంత్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు నిరంజన్ రెడ్డి, కౌన్సిలర్లు గంజి రాజు, నరేష్, విఠల్, సురేందర్, సూరజ్ నాయక్, కూన శశాంక్, సోన్ మండల అధ్యక్షుడు మార గంగారెడ్డి, సర్పంచులు గంగారెడ్డి, సాహెబ్ రావు, నాయకులు అర్జున్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Also Read : కాంగ్రెస్ అభ్యర్థులుగా ‘రెడ్డి’లకే ఛాన్స్.. స్పందించిన మల్లు రవి

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>