పీఎం సూర్య ఘర్‌తో సౌర విద్యుత్‌ సద్వినియోగం

కలం, నిర్మల్: నిర్మల్‌ (Nirmal) పట్టణంలోని విద్యుత్‌ శాఖ కార్యాలయంలో సేవా సేతు కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘పీఎం సూర్య ఘర్‌ ముఫ్త్‌ బిజ్లీ యోజన’ (PM Surya Ghar Solar Power Scheme) పథకంపై గురువారం ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా అధికారులు మాట్లాడుతూ.. గృహ వినియోగదారులు సౌర విద్యుత్‌ను సద్వినియోగం చేసుకుని విద్యుత్‌ బిల్లుల భారాన్ని తగ్గించుకోవాలని సూచించారు. పథకం కింద గృహాలపై రూఫ్‌ టాప్‌ సౌర విద్యుత్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవడం ద్వారా సొంత అవసరాలకు విద్యుత్‌ ఉత్పత్తి చేసుకోవడంతో పాటు విద్యుత్‌ బిల్లుల భారాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ, రూఫ్‌టాప్‌ సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటు విధానం, దరఖాస్తు ప్రక్రియ, బ్యాంకు రుణ సదుపాయాలపై వినియోగదారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో టీజీఎస్‌పీడీసీఎల్‌ డివిజనల్‌ ఇంజినీర్‌ నాగరాజు, జిల్లా లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ రామ్‌గోపాల్‌, టౌన్‌ అసిస్టెంట్‌ డివిజనల్‌ ఇంజినీర్‌ శ్రీనివాస్‌, విద్యుత్‌, బ్యాంకింగ్‌ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>