epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఉద్రిక్తంగా మారుతున్న బీసీ బంద్..

బీసీ బంద్(BC Bandh) పలు చోట్ల ఉద్రిక్తంగా మారుతోంది. బంద్‌ను కాదని తెరిచిన కొన్ని షాపులపై బీసీ సంఘాల నాయకులు దాడులు చేస్తున్నారు. యజమానులకు, పనిచేసే వారిని బెదిరించి షాపులు మూయిస్తున్నారు. హైదరాబాద్-నల్లకుంట పరిధిలో ఇటువంటి ఘటనే ఒకటి జరిగింది. బీసీ బంద్ నేపథ్యంలో తెరిచి ఉన్న బజాజ్ షోరూమ్‌పై బీసీ సంఘాల నాయకులు రాళ్ల దాడులు చేశారు. అద్దాలను పగలుగొట్టి షోరూమ్‌ను మూయించారు. అదే విధ:గా రాఘవేంద్ర టిఫిన్ సెంటర్‌పైన కూడా వారు దాడులు చేశారు. బలవంతంగా షాపులు మూయించారు. అదే ప్రాంతంలో తెరిచి ఉన్న పెట్రోల్ బంక్‌పైన కూడా బీసీ సంఘాల నేతలు దాడులకు పాల్పడ్డారు.

Read Also: బీసీ బంద్‌లో కింద పడిపోయిన కాంగ్రెస్ నేత..

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>