కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నిర్మల్ (Nirmal ABVP) నగర కమిటీని గురువారం ఎన్నుకున్నారు. నగర అధ్యక్షుడిగా డిగ్రీ లెక్చరర్ తోకల శ్రీనివాస్, పట్టణ కార్యదర్శిగా నాంపల్లి సాయి అక్షయ్, సంయుక్త కార్యదర్శులుగా గౌతమ్, పవన్, రామ్చరణ్, సాయి చరణ్, ఉపాధ్యక్షులుగా మధు, కార్తిక్, వరుణ్, మణిరాజ్, సందీపని ఇంచార్జిగా లక్ష్మీప్రసాద్, ఎస్ఎఫ్డీ ఇంచార్జిగా వినయ్, ఎస్ఎఫ్ఎస్ ఇంచార్జిగా అజయ్, సోషల్ మీడియా ఇంచార్జిగా మణికంఠ, హాస్టల్ ఇంచార్జిగా నిక్షయ్, ఖేల్ ఇంచార్జిగా అఖిలేష్ ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, ఇందూర్ విభాగ్ సంఘటన మంత్రి హర్షవర్ధన్ మాట్లాడుతూ.. పూర్తి వందేమాతరం గీతాన్ని ఆలపించడం ద్వారా విద్యార్థుల్లో దేశభక్తి మరింత పెంపొందుతుందని అన్నారు. ఏబీవీపీ ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘమని పేర్కొన్నారు. విద్యారంగ సమస్యల పరిష్కారానికి విద్యార్థి పరిషత్ నిరంతరం ముందుంటుందని తెలిపారు. విద్యార్థులకు కుల, మత భేదాలు లేకుండా ఆపదలో అండగా నిలిచి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసే సంస్థ ఏబీవీపీ అని అన్నారు.

