కలం, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఖైరతాబాద్ ఉప ఎన్నిక హాట్ టాపిక్‌గా మారిన వేళ ఢిల్లీలో దానం నాగేందర్ (Danam Nagender) కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు దర్శనమివ్వడం కలకలం రేపుతోంది. ఢిల్లీ (Delhi) లోని తెలంగాణ భవన్ ఎదుట దానం నాగందర్‌కు వ్యతిరేకంగా కొందరు వ్యక్తులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ (Congress Party) నాయకుల పేరిట ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలో సీఎం రేవంత్, పీసీసీ చీఫ్, ఖర్గే, రాహుల్, ప్రియాంక గాంధీల ఫోటోలు ఉన్నాయి. ఏఐసీసీ పెద్దలను, సీడబ్ల్యూసీ మెంబర్లను, తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్‌లను ఉద్దేశిస్తూ ఈ ఫ్లెక్సీలో కీలక వ్యాఖ్యలు చేశారు.
రానున్న ఖైరతాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా వేణుగోపాల్ స్వామికి అవకాశం ఇవ్వాలని కోరారు. గతంలో కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్‌కు అవకాశం కల్పిచారని, ఆయన ఓడిపోయాడని వ్యాఖ్యానించారు. ఇప్పుడు మళ్లీ ఉప ఎన్నికలో చాన్స్ ఇచ్చినా ఓడిపోతాడని చెప్పారు. ఆయన బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరాడని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ ఉప ఎన్నికలో దానం నాగేందర్‌కు టికెట్ ఇవ్వబోతుందన్న వార్తల నేపథ్యంలో ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ ఇస్తుందన్నది ఇంకా ఫైనల్ కాలేదు.

