రొనాల్డో షాక్.. పోర్చుగల్ క్యాంప్‌ నుంచి అవుట్

కలం, స్పోర్ట్స్: పోర్చుగల్ ఫుట్‌బాల్‌ (Portugal Football) లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) జాతీయ జట్టు శిక్షణ శిబిరం నుంచి వెళ్లిపోయాడు. కోచ్ జార్జ్ జీసస్‌తో విభేదాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కోచ్ మీడియా సమావేశం తర్వాత, పోర్చుగీస్ ఫుట్‌బాల్ సమాఖ్య అధ్యక్షుడు పెద్రో ప్రోయెన్సాతో మాట్లాడిన అనంతరం క్యాంప్‌ నుంచి వెళ్లినట్లు రొనాల్డో సోషల్ మీడియాలో వెల్లడించాడు. వివాదానికి నార్వేతో జరిగిన మ్యాచ్‌ నుంచే బీజం పడింది.

ఆ మ్యాచ్‌లో రొనాల్డో బెంచ్‌కే పరిమితమయ్యాడు. జట్టు 2-1తో గెలిచినా.. రొనాల్డోకు మైదానంలోకి దిగే అవకాశం రాలేదు. దీంతో అతను అసంతృప్తికి గురైనట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత రొనాల్డో జట్టు సాధారణ శిక్షణకు దూరంగా ఉన్నాడు. ఈ వ్యవహారంపై జీసస్ మాత్రం రొనాల్డో శిక్షణకు నిరాకరించలేదని చెప్పాడు. జట్టు ఎంపిక విషయంలో తుది నిర్ణయం తనదేనని స్పష్టం చేశాడు. డెన్మార్క్‌తో జరగనున్న మ్యాచ్‌లో రొనాల్డోను ఆడించకపోవచ్చని కూడా వెల్లడించాడు.

ఈ పరిణామాల మధ్య సమాఖ్య అధ్యక్షుడు పెద్రో ప్రోయెన్సా కూడా రొనాల్డో, జీసస్‌తో మాట్లాడాడు. సమస్యను పరిష్కరించేందుకు చర్చలు జరిగినప్పటికీ.. ఆ తర్వాత రొనాల్డో క్యాంప్‌ నుంచి వెళ్లిపోయాడు. క్యాంప్‌ నుంచి వెళ్లిన విషయాన్ని రొనాల్డో స్వయంగా ప్రకటించాడు. తన నిర్ణయానికి గల కారణాలను సరైన సమయంలో పోర్చుగల్ ప్రజలకు వివరిస్తానని చెప్పాడు. ప్రస్తుతం పోర్చుగల్ జట్టు రొనాల్డో లేకుండానే తదుపరి మ్యాచ్‌కు సిద్ధమవుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>