కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వం మంచిరేవులలో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌కు (Young India Police School) భారీగా విరాళం వచ్చింది. ఎంవైకే లాటిక్రేట్ ఫౌండేషన్ సీఎస్ఆర్ నిధుల్లో భాగంగా రూ.2 కోట్లు విలువైన చెక్కును డీజీపీ సీవీ ఆనంద్(DGP CV Anand)కు అందించింది. ఈ నిధులతో స్కూల్లో మరిన్ని అకడమిక్ బ్లాక్‌లు నిర్మించబోతున్నారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. నాణ్యమైన విద్యను అందించేందుకు ఇంత మొత్తం విరాళం అందించడం ఎంతో ఆహ్వానించదగ్గ పరిణామమన్నారు.
రూ.2 కోట్ల విరాళంతో స్కూల్‌లో సౌకర్యాలు సమకూరి విద్యార్థులు గొప్పగా చదువుకుని సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా మారుతారని డీజీపీ సీవీ ఆనంద్ (DGP CV Anand) ఆశాభావం వ్యక్తం చేశారు. కేవలం పోలీస్ సిబ్బందికే కాకుండా సాధారణ ప్రజలకు కూడా యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌లో చదువుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు వివరించారు. అర్ధవంతమైన సమాజ నిర్మాణానికి విద్య మీద పెట్టే పెట్టుబడులు ప్రభావం చూపుతాయన్నారు.
Also Read : దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు
Follow Us On: Youtube

