కలం, హనుమకొండ: హనుమకొండ (Hanumakonda) జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశా) సమావేశం (DISHA Meeting) లో వరంగల్ ఎంపీ, దిశా కమిటీ చైర్మన్ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, నాగరాజు, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి జిల్లాలో వివిధ శాఖల ద్వారా అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై అధికారులతో విస్తృతంగా చర్చిస్తున్నారు.
ముందుగా గతంలో మార్చి 7న జరిగిన దిశా సమావేశం మినిట్స్‌పై తీసుకున్న చర్యల నివేదికలను పరిశీలించారు. అనంతరం వ్యవసాయం, ఉద్యానవనం, విద్య, వైద్య–ఆరోగ్యం, రోడ్డు భద్రత మొదలగు అంశాలపై చర్చించారు. నిరుపేదలకు ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా, అభివృద్ధి పనులను నిర్దేశిత సమయంలో పూర్తి చేసేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు.

