కలం, మహబూబ్‌నగర్ బ్యూరో : ప్రపంచ రక్త దాన దినోత్సవ సందర్భంగా గురువారం మహబూబ్‌నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం (Blood Donation Camp) నిర్వహించారు. ఈ సందర్భంగా స్వచ్ఛందంగా 40 మంది రక్తదానాన్ని ఇచ్చినట్లు ఆస్పత్రి బ్లడ్ బ్యాంక్ ఇన్చార్జ్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఆపదలో ఉన్నవారికి రక్తాన్ని ఇవ్వడం ద్వారా వారి ప్రాణాన్ని నిలబెట్టిన వారవుతారని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకొని విరివిరిగా రక్తదానం చేయాలనీ, మధుసూదన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
Also Read : పేదల ఆరోగ్యానికి చేయూత.. మేఘారెడ్డి ప్రత్యేక చొరవ
Follow Us On: X(Twitter)

