కలం, వనపర్తి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు (Graduate MLC Elections) సాధారణ ఎన్నికలకు సెమీఫైనల్స్ వంటివని, ఎమ్మెల్సీ పోరులో సత్తా చాటాలనీ మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు హైదరాబాద్, రంగారెడ్డి, పాలమూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం గురువారం వనపర్తిలోని బీఆర్ఎస్ (BRS) జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించారు.
మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి (Niranjan Reddy) ముఖ్యఅతిథిగా హాజరై పార్టీ శ్రేణులకు ఎన్నికల వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సాధారణ ఎన్నికలకు సెమీఫైనల్స్ వంటివని నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. ఉద్యోగులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయకపోవడంతో వారిలో అసంతృప్తి నెలకొందని ఆయన అన్నారు.
ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులు నెలరోజుల పాటు ప్రత్యేక దృష్టి సారించి పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించాలని సూచించారు. గ్రాడ్యుయేట్లు (Graduates) తాజా ఓటు నమోదు ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పార్టీ శ్రేణులు గ్రామాల వారీగా పట్టభద్రులను కలిసి ఓటు నమోదు చేయించాలని సూచించారు.
43 నియోజకవర్గాల పరిధిలో ఎమ్మెల్సీ ఎన్నిక జరగనున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. అభ్యర్థి విషయంలో పార్టీ తీసుకునే నిర్ణయమే శిరోధార్యమని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో (Graduate MLC Elections) విజయం సాధించి ప్రభుత్వానికి ప్రజల అసంతృప్తిని తెలియజేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
Also Read : యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌కు భారీగా విరాళం
Follow Us On: Youtube

