కలం, వెబ్ డెస్క్: స్థానిక సంస్థల ఎన్నికలపై ఏపీ హైకోర్టు (AP High Court) సంచలన తీర్పు వెలువరించింది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన రెండు జీవోలను కొట్టేసింది. జీవో నెం.105, జీవో నెం.1065ను రద్దు చేస్తూ తుది తీర్పు ప్రకటించింది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 100 మున్సిపాలిటీలు, 13,313 గ్రామ పంచాయతీలు, 9,983 ఎంపీటీసీ, 661 జడ్పీటీసీ స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
కోర్టు కేసులు తేలిన వెంటనే నోటిఫికేషన్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఈ నేపథ్యంలో.. బీసీ రిజర్వేషన్లు కొట్టేస్తూ తీర్పు వెలువరించిన నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది. అక్టోబర్ మొదటి వారంలోనే నోటిఫికేషన్ విడుదల చేద్దామన్న ప్రభుత్వానికి.. కోర్టు తీర్పు షాకింగ్ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

