హరిణి హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. హాట్‌స్పాట్‌తో చిక్కిన నిందితుడు!

కలం, ఖమ్మం బ్యూరో: నర్సింగ్ విద్యార్థిని ఇంద్రవల్లి హరిణి హత్య కేసులో (Harini Murder Case) సంచలన మలుపు చోటుచేసుకుంది. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు తిరుపతి పారిపోయి సుతారీ మేస్త్రీ అవతారమెత్తిన నిందితుడు దేవరకొండ పవన్ కుమార్, ఆఖరికి ఒక సెల్‌ఫోన్ హాట్‌స్పాట్ కారణగా పోలీసులకు దొరికిపోయాడు.

​భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంకన్నపాలెం ఎస్సీ కాలనీకి చెందిన బిఎస్సీ నర్సింగ్ విద్యార్థిని హరిణి సెప్టెంబరు 22న అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా హరిణిని గొంతు నులిమి హత్య చేశారని పోస్ట్‌మార్టం ప్రాథమిక నివేదికలో వెల్లడి కావడంతో, తమ కాలనీకే చెందిన పవన్ కుమారే ఈ దారుణానికి ఒడిగట్టాడని ఆమె తల్లి రాజేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు వేగవంతం చేశారు. నిందితుడి సెల్‌ఫోన్ IMEI నంబరు ఆధారంగా నిఘా పెట్టగా, అతడు వేరొక వ్యక్తి సెల్‌ఫోన్ హాట్‌స్పాట్ (Mobile Hotspot) సహాయంతో ఇన్‌స్టాగ్రామ్ మెసేజ్‌లు చూస్తున్నట్లు సాంకేతిక బృందం గుర్తించింది. ఆ హాట్‌స్పాట్ లొకేషన్ ఆధారంగా పోలీసులు తిరుపతికి చేరుకుని, సదరు ఫోన్ నంబర్ ద్వారా ఓ సుతారీ మేస్త్రీని అదుపులోకి తీసుకుని విచారించగా,

​గత ఐదారూ రోజుల నుంచి పవన్ తన వద్ద పనికి కుదిరాడని ఆ మేస్త్రీ చెప్పిన వివరాలతో పోలీసులు నిందితుడు ఉంటున్న స్థావరానికి వెళ్లి మంగళవారం సాయంత్రం అతడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అనంతరం అతడిని జూలూరుపాడు సర్కిల్ పరిధిలోని పోలీస్ స్టేషన్‌కు తరలించి, ఇద్దరు సీఐల సమక్షంలో హత్యకు గల కారణాలపై తీవ్రంగా విచారిస్తున్నట్లు సమాచారం. కాగా పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>