కలం, వెబ్‌డెస్క్: సికింద్రాబాద్‌లోని కుషాయిగూడ (Kushaiguda) పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ కారు అతివేగంతో వచ్చి తొమ్మిది మందిని ఢీకొట్టింది. ఈసీఐఎల్‌లోని న్యూ చైతన్య కాలేజీ సమీపంలో ఈ ఘటన జరిగింది. దేవి షాప్ ఎదురుగా తొమ్మిది మంది నడుచుకుంటూ వెళ్తుండగా ఓ కారు వీరిని ఢీకొట్టింది. ఈ ఘటనలో గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండగా, మిగతా వారికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు సీసీ ఫుటేజ్ పరిశీలించి కారు నెంబర్ AP 10 AU 1232 గా గుర్తించారు. సీసీ కెమెరా ఆధారంగా కారు ఎటువైపు వెళ్లిందని దర్యాప్తు చేస్తున్నారు.

