కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల (CWSN Children) తల్లిదండ్రులకు సమగ్ర విద్యపై ఒకరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా విద్యాశాఖాధికారి భోజన్న అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి డీఎల్ఎస్ఏ కార్యదర్శి పి. రవీందర్, ఇంచార్జి అదనపు కలెక్టర్ రమేష్ రాథోడ్, వైద్య నిపుణులు డాక్టర్ జగదీష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల హక్కులు, ప్రభుత్వ పథకాలు, భవిత కేంద్రాల సేవలు, సహాయక పరికరాలు, స్కాలర్‌షిప్‌లు, ఉచిత న్యాయ సహాయం తదితర అంశాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలను పాఠశాలలకు పంపించి, సమగ్ర విద్య ద్వారా ప్రధాన స్రవంతిలోకి తీసుకురావాలని అధికారులు సూచించారు. కార్యక్రమంలో ప్రత్యేక ఉపాధ్యాయులు, సమగ్ర శిక్షా సిబ్బంది, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Also Read : నీరు ధండా జోరు.. రెండు గోల్డ్స్, సిల్వర్
Follow Us On : WhatsApp

