కలం, యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట మండలంలోని వంగపల్లి గ్రామ అంగన్‌వాడీ (Vangapally Anganwadi) కేంద్రంలో ‘అంగన్ మిలన్’ (Angan Ka Milan) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ మండల అధ్యక్షురాలు గుంటిపల్లి మహేశ్వరి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె అంగన్‌వాడీ కేంద్రంలోని చిన్నారులతో ఆప్యాయంగా ముచ్చటించి, వారికి ఆట వస్తువులను పంపిణీ చేశారు. చిన్నారుల ఆరోగ్యం, సంరక్షణతో పాటు వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తూ సేవలందిస్తున్న అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలను శాలువాలతో సన్మానించి అభినందించారు.
అనంతరం అంగన్‌వాడీ (Vangapally Anganwadi) కేంద్రం ద్వారా లబ్ధిదారులకు అందుతున్న సేవలను ఆమె సమీక్షించారు. చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం, బాలామృతం, పాలు, గుడ్లు తదితరాలు సక్రమంగా అందుతున్నాయా అనే విషయాన్ని లబ్ధిదారులను నేరుగా అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలో అందుతున్న సేవలు, నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో షారాజీ విజయ, జిల్లా కౌన్సిల్ సభ్యులు గంధమల్ల మహేష్ గౌడ్, జిల్లా కార్యవర్గ సభ్యులు దొంత భరత్, BJYM జిల్లా ఉపాధ్యక్షులు బండి మహేష్, మండల ప్రధాన కార్యదర్శి గోపగాని ప్రసాద్ గౌడ్, బూత్ అధ్యక్షులు జోగు మహేష్, నమిలే వెంకటేష్, బొమ్మగాని బిక్షం, టి.బిక్షపతి, ఎడపల్లి సురేష్, నర్సింగరావు, రజినీకాంత్, బండికింది సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. అంగన్‌వాడీ సిబ్బంది, తల్లులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
Also Read : బీఆర్ఎస్ పాలనలో ఉరిసిల్లగా మారిన సిరిసిల్ల : సీఎం రేవంత్
Follow Us On: X(Twitter)

