మెదక్ జిల్లాకు అమిత్ షా.. ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ

కలం, మెదక్ బ్యూరో : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా (Amit Shah) మెదక్​ జిల్లాలో పర్యటించనున్నారు. అక్టోబర్‌ 4న జిల్లాలోని బ్రాహ్మణపల్లె వద్ద అమూల్‌ పాల కంపెనీ ఏర్పాటు భూమిపూజ కార్యక్రమానికి అమిత్‌ షా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు కార్యక్రమ ప్రదేశాన్ని పరిశీలించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. వేదిక, వీవీఐపీ రాకపోకల మార్గాలు, పార్కింగ్‌ ప్రాంతాలు, సభా ప్రాంగణం, పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

వీవీఐపీ పర్యటన నేపథ్యంలో విధులు నిర్వహించే ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది తమకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని ఎస్పీ ఆదేశించారు. భద్రతా ఏర్పాట్లలో ఎలాంటి లోపాలకు తావులేకుండా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్‌ డీఎస్పీ జె. నరేందర్‌ గౌడ్‌, సీఐలు సందీప్‌ రెడ్డి, రంగకృష్ణ, ఆర్‌ఐ శైలేందర్‌, ఎస్‌ఐలు గంగా రాజు, సుభాష్‌ గౌడ్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Also Read : కాంగ్రెస్, బీఆర్ఎస్ దొంగ నాటకాలను తిప్పికొడతాం: బండి సంజయ్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>