ఆహార భద్రత చట్టం అమలులో నిర్లక్ష్యం వద్దు: ఫుడ్ కమిషన్ ఛైర్మన్

కలం, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో జాతీయ ఆహార భద్రత చట్టం–2013 (Food Security Act-2013) ను పకడ్బందీగా అమలు చేసి, అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్‌, పౌష్టికాహారం, ఆహార భద్రత పథకాల ప్రయోజనాలు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ గోలి శ్రీనివాస్‌రెడ్డి (Goli Srinivas Reddy) అధికారులను ఆదేశించారు. జిల్లాలో రెండు రోజుల క్షేత్ర పర్యటనలో భాగంగా బుధవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

అంగన్వాడీ కేంద్రాలలో అందిస్తున్న గుడ్ల నాణ్యతను సమావేశంలో చైర్మన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఫుడ్ కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ.. అంగన్‌వాడీ కేంద్రాలు, సంక్షేమ వసతి గృహాలు, రేషన్‌ దుకాణాల్లో నేమ్‌బోర్డులు ఏర్పాటు చేసి, సంబంధిత బాధ్యుల వివరాలు, ఫిర్యాదు చేసే విధానం, టోల్‌ఫ్రీ నంబర్లను ప్రజలకు స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహారం అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండరాదన్నారు.

క్షేత్ర పర్యటనలో భాగంగా ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలు, జూనియర్‌ కళాశాల హాస్టళ్లలో నిర్వహించిన తనిఖీల సందర్భంగా భోజన వేళలు, మెనూ అమలు, వంటగది పరిశుభ్రత, వంట సామగ్రి నిర్వహణ, అధికారుల పర్యవేక్షణలో కొన్ని లోపాలు గుర్తించినట్లు తెలిపారు. ప్రభుత్వ నిధులతో విద్యార్థుల సంక్షేమం కోసం పెద్దఎత్తున కార్యక్రమాలు అమలు చేస్తున్న నేపథ్యంలో సిబ్బంది పూర్తి బాధ్యతతో విధులు నిర్వహించాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో ఫుడ్‌ కమిషన్‌ సభ్యులు ఒరగంటి ఆనంద్‌, జిల్లా కలెక్టర్‌ రాజర్షి షా, అదనపు కలెక్టర్లు రాజేశ్వర్‌, ఆర్‌.ఎస్‌.చిత్రు, డీఆర్‌ఓ స్రవంతి, ఆర్డీవో జగదీశ్వర్‌రావు, డీఆర్‌డీఓ రాథోడ్‌ రవీందర్‌, డీఎస్‌వో నందిని, డీఎం సుధారాణి, డీఈవో మాధవి, డీఎంహెచ్‌వో సాధన, ఎస్సీ, బీసీ సంక్షేమ శాఖల అధికారులు సోనియా, సునీత, సీడీపీవోలు, ఎంఈవోలు, రేషన్‌ డీలర్ల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

Also Read : కాంగ్రెస్, బీఆర్ఎస్ దొంగ నాటకాలను తిప్పికొడతాం: బండి సంజయ్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>