బాల్య వివాహాల నిర్మూలనకు గ్రామసభలే వేదిక.. కలెక్టర్ రాజర్షి షా

కలం, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలనకు ప్రజల్లో అవగాహన కల్పిస్తూ అక్టోబర్ 2న నిర్వహించే గ్రామసభల్లో బాల్య వివాహ రహిత గ్రామం అంశాన్ని(Child Marriage-Free Villages) ఎజెండాలో చేర్చాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. ‘బాల్ వివాహ్ ముక్త్ భారత్’ కార్యక్రమంలో భాగంగా రూపొందించిన పోస్టర్‌ను బుధవారం జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ ఆవిష్కరించారు.

బాల్య వివాహాల వల్ల కలిగే దుష్పరిణామాలు, చట్టపరమైన నిబంధనలు, బాల్య వివాహాల నివారణలో గ్రామ పంచాయతీలు, ప్రజలు, సమాజం పాత్రపై గ్రామసభల్లో విస్తృతంగా చర్చించాలని కలెక్టర్ రాజర్షి షా (Collector Rajarshi Shah) సూచించారు. బాల్య వివాహాల నిర్మూలనకు సంబంధించి గ్రామసభల్లో తీర్మానాలు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, నీతి ఆయోగ్ చైల్డ్ రైట్స్ అసోసియేట్ దేవిశ్రీ, ఐసీపీఎస్ అసిస్టెంట్ కమ్ డీఈవో ప్రేమ్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Also Read : కరువు.. కరెంట్ కష్టాలతో రైతాంగం ఉక్కిరిబిక్కిరి!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>