రీల్ పిచ్చి.. బైక్ స్టంట్ చేసిన యువకుడికి భారీ ఫైన్

కలం, వెబ్ డెస్క్ : రీల్ కోసం ప్రమాదకర బైక్ స్టంట్ (Bike Stunt) చేసిన యువకుడికి పోలీసులు భారీ జరిమానా విధించారు. ఈ ఘటన హర్యానాలోని పంచకుల (Panchkula) చండీమందిర్ టోల్ ప్లాజా వద్ద చోటుచేసుకుంది. ఓ యువకుడు వేగంగా బైక్ నడుపుతూ దానిపై నిల్చొని ప్రమాదకర స్టంట్ చేశాడు. ఈ క్రమంలో అదుపుతప్పి కిందపడిపోగా, బైక్ డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనను మరో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.

వీడియో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు స్టంట్ చేసిన యువకుడిని గుర్తించారు. ప్రమాదకరంగా స్టంట్ చేసిన బైక్‌కు రూ.25 వేల చలాన్ విధించారు. స్టంట్‌ను వీడియో తీసిన మరో బైక్‌కు రూ.20 వేల జరిమానా విధించారు. మొత్తంగా రెండు బైక్‌లపై రూ.45 వేల జరిమానా విధించిన పోలీసులు వాటిని సీజ్ చేశారు. అనంతరం యువకులకు రోడ్డు భద్రతపై కౌన్సెలింగ్ ఇచ్చారు. రీల్స్ కోసం ప్రాణాలను పణంగా పెట్టి ప్రమాదకర స్టంట్లు చేయవద్దని పోలీసులు హెచ్చరించారు. రహదారులపై నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

Also Read : కరువు.. కరెంట్ కష్టాలతో రైతాంగం ఉక్కిరిబిక్కిరి!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>