నిర్మల్‌లో పోలీస్‌ 30 యాక్ట్‌ అమలు.. ప్రజలకు ఎస్పీ కీలక హెచ్చరిక

కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు అక్టోబర్ నెలాఖరు వరకు పోలీస్‌ 30 యాక్ట్‌ (Police 30 Act) అమల్లో ఉంటుందని ఎస్పీ జానకి షర్మిల (SP Janaki Sharmila) బుధవారం తెలిపారు. డివిజనల్‌ పోలీసు అధికారి అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదని హెచ్చరించారు. ప్రజా శాంతికి భంగం కలిగించే చర్యలు, బహిరంగ ప్రదేశాల్లో డీజేలు, మ్యూజిక్‌, ప్రసంగాలు నిర్వహించడం నిషేధమని స్పష్టం చేశారు.

చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్‌ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం, మత విద్వేషాలు, సామాజిక ఉద్రిక్తతలకు దారితీసే పోస్టులు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పోలీసులకు సహకరించాలని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>