అమ‌రావ‌తి ప్ర‌పంచ‌ రాజ‌ధాని అవుతుంది: సీఎం చంద్ర‌బాబు

క‌లం, వెబ్‌డెస్క్: భ‌విష్య‌త్తులో అమ‌రావ‌తి (Amaravati) ప్ర‌పంచ రాజ‌ధాని అవుతుంద‌ని సీఎం చంద్ర‌బాబు (CM Chandrababu) అన్నారు. విజ‌య‌వాడ‌లోని మాకినేని బ‌స‌వ‌పున్న‌య్య స్టేడియంలో నేడు నిర్వ‌హించిన పేద‌ల‌కు ప‌ట్టాభిషేకం కార్య‌క్ర‌మంలో సీఎం చంద్ర‌బాబు నేడు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… అమ‌రావ‌తి ప్ర‌పంచ రాజ‌ధాని అవుతుంద‌ని, రానున్న రోజుల్లో రాజ‌ధానికి బుల్లెట్ ట్రైన్ కూడా వ‌స్తుంద‌ని చెప్పారు. ఇక అమ‌రావ‌తికి , విజ‌య‌వాడ‌కు నీళ్లే అంద‌మ‌ని సీఎం వ్యాఖ్యానించారు. కొంత మంది ఇప్ప‌టికీ మావిగ‌న్ అంటూ పిచ్చి కూత‌లు కూస్తున్నార‌ని మండిప‌డ్డారు. అమ‌రావ‌తిని వ్య‌తిరేకించిన వారిపై పోరాడి రాజ‌ధానిని కాపాడుకున్నామ‌ని తెలిపారు.

పేద‌ల‌కు ప‌ట్టాలు ఇస్తే కూడా గొడ్డ‌లి పార్టీ ఎలా ఇస్తారంటూ ఆపేందుకు కుట్ర‌లు చేస్తున్నార‌ర‌ని ఆరోపించారు. రాష్ట్రంలో ఏ మంచి పని చేయాల‌న్నా అడ్డుప‌డుతున్నార‌ని మండిప‌డ్డారు. అమ‌రావ‌తి ప్ర‌జా రాజ‌ధాని అని, ఇది పురాణాల్లో దేవ‌త‌ల రాజ‌ధాని అని సీఎం తెలిపారు. ఇక్క‌డే దుర్గ‌మ్మ త‌ల్లి ఉంద‌ని, దుష్టుల‌ను శిక్షిస్తుంద‌ని అన్నారు. క‌లియుగ దైవం వేంక‌టేశ్వ‌ర స్వామి కూడా ఇక్క‌డే ఉన్నార‌ని సీఎం అన్నారు. వైసీపీ నేత‌లు ముందు అమ‌రావ‌తి స‌రైంద‌ని అంగీక‌రించి మేం కూడా స‌హ‌క‌రిస్తామ‌ని హామీ ఇచ్చార‌న్నారు. రైతులు కూడా ముందుకొచ్చార‌ని చెప్పారు. చివ‌రికి రైతులు భూములు ఇచ్చిన త‌ర్వాత అడ్డుకునేందుకు కుట్ర‌లు చేశార‌ని మండిప‌డ్డారు. వ‌ర‌ల్డ్ బ్యాంక్‌కు లేఖ‌లు రాసి రాజ‌ధానిని వ్య‌తిరేకించార‌ని తెలిపారు. స్థానిక రైతుల చెర‌కు తోట‌ల‌కు నిప్ప పెట్టార‌ని ఆరోపించారు. త‌ర్వాత‌ మూడు రాజ‌ధానులు కావాలంటూ కొత్త డ్రామాకు తెర‌లేపార‌ని ఎద్దేవా చేశారు. అమ‌రావ‌తి ఎడారి అని, స్మ‌శానం అని ఆరోపించార‌న్నారు. అమ‌రావ‌తిని నాశ‌నం చేసేందుకు రాష్ట్రంలో ఉన్న ప్ర‌తి ఒక్క‌రినీ తీసుకొచ్చి ఇక్క‌డ ఇండ్లు క‌ట్టి దీన్ని ఒక‌ స్ల‌మ్ చేయాల‌ని ప్ర‌య‌త్నించార‌ని ఆరోపించారు. దేవుడే రాజ‌ధానిని కాపాడాడ‌ని, ఈ రోజు అమ‌రావ‌తిని ఎవ్వ‌రూ ఏమీ చేయ‌లేర‌ని స్ప‌ష్టం చేశారు. అమ‌రావ‌తిని ఏదైనా చేసేందుకు ప్ర‌య‌త్నిస్తే అమ‌రావ‌తే వారి అంతు చూస్తుంద‌ని తేల్చి చెప్పారు.

త్వ‌ర‌లో అమ‌రావ‌తికి ఇన్న‌ర్ రింగ్ రోడ్డు, ఔట‌ర్ రింగ్ రోడ్డు వ‌స్తుంద‌ని సీఎం చంద్ర‌బాబు అన్నారు. రాష్ట్రాల‌కు క‌నెక్టివిటీ ఏర్ప‌డుతుంద‌ని చెప్పారు. విశాఖ ప‌ట్నం నుంచి చెన్నై వ‌ర‌కు నాలుగు లేన్ల రైల్వే లైన్లు వ‌స్తాయ‌న్నారు. ఇవ‌న్నీ వ‌స్తే అమ‌రావ‌తి, విజ‌య‌వాడ‌, గుంటూరు ఒక్క‌టైపోయి అన్‌స్టాప‌బుల్ సిటీ అవుతుంద‌న్నారు. ప్ర‌పంచంలో ఉండే వెయ్యి న‌గ‌రాల్లో ఒక న‌గ‌రం విజ‌య‌వాడ అన్నారు. విజ‌య‌వాడ ప్రపంచంలో చాలా విష‌యాల్లో ముందున్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉండే విజ‌య‌వాడ వాసులు మ‌ళ్లీ ఇక్క‌డికి రావాల‌ని, మీకు అవ‌కాశం క‌ల్పించే బాధ్య‌త మాదేన‌ని సీఎం పిలుపునిచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>