బుగ్గారం ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక

కలం, జగిత్యాల: జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో బుధవారం ప్రెస్ క్లబ్ (Buggaram Press Club) నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. TWJF రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు ఎన్నాం కిషన్ రెడ్డి నాయకత్వంలో నిర్వహించిన సమావేశంలో నూతన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేసి, పాత్రికేయుల సమస్యలు, హక్కుల పరిరక్షణతో పాటు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో ఐక్యంగా పనిచేయాలని నిర్ణయించారు.

ఈ కార్యవర్గంలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా చిర్ర సత్యం, అధ్యక్షులుగా దూడ జీవన్, ఉపాధ్యక్షులుగా వెల్గటూర్ ప్రేమ్ కుమార్, దొంతమల్ల సురేష్, ప్రధాన కార్యదర్శిగా జైశెట్టి రాకేష్, కార్యదర్శులుగా మేడిపల్లి గంగాధర్, నక్క శంకర్ సంయుక్త కార్యదర్శిగా బొమ్మెన శ్రీహరి, ప్రచార కార్యదర్శిగా బత్తిని తిరుపతి, కార్యవర్గ సభ్యులుగా జానకిరామ్, తోవిటి వెంకట స్వామి, అవ్వ సాయి కృష్ణ, నక్క సునీల్, కళ్లెం నగేష్ లను ఎన్నుకున్నారు.

నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. బుగ్గారం మండలంలోని పాత్రికేయులందరి ఐక్యతకు కృషి చేస్తామని అన్నారు.  పాత్రికేయుల హక్కుల పరిరక్షణతో పాటు ప్రజా సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>