జర్నలిస్టులకు ఉచిత మెగా హెల్త్ చెకప్

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: జిల్లా కేంద్రంలోని జర్నలిస్టులు, వారి సతీమణుల ఆరోగ్య పరిరక్షణ కోసం పాలమూరు జర్నలిస్టుల సంక్షేమ సంఘం, ప్రెస్ క్లబ్ సంయుక్తంగా స్థానిక ఎస్వీఎస్ ఆసుపత్రి, మెడికల్ కాలేజీ సౌజన్యంతో సమగ్ర ఉచిత మాస్టర్ హెల్త్ చెకప్ శిబిరాన్ని ఏర్పాటు చేశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై లాంఛనంగా ప్రారంభించాల్సిందిగా కోరుతూ ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కి క్యాంపు కార్యాలయంలో ఆహ్వాన పత్రికను బుధవారం అందజేశారు.

వృత్తిరీత్యా నిరంతరం ఒత్తిడికి గురవుతూ విధులు నిర్వర్తించే పాత్రికేయుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ శిబిరంలో జర్నలిస్టులతో పాటు వారి సతీమణులకు కూడా సమగ్ర వైద్య, రక్త, గుండె సంబంధిత పరీక్షలు ఉచితంగా నిర్వహించనున్నారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ, జర్నలిస్టుల ఆరోగ్య పరిరక్షణ కోసం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు. ఆహ్వాన పత్రిక అందజేసిన వారిలో పాలమూరు జర్నలిస్టుల సంక్షేమ సంఘం, ప్రెస్ క్లబ్ బాధ్యులు, సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>