కేజీబీవీలో దారుణం.. అజ్ఞాత వ్యక్తి ఇంటికి విద్యార్థినుల‌ తరలింపు!

క‌లం, వెబ్‌డెస్క్: ప్రకాశం (Prakasam) జిల్లాలోని జరుగుమల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (Zarugumalli KGBV)లో దారుణ ఘటన చోటు చేసుకుంది. హాస్టల్‌లో చదువుకుంటున్న విద్యార్థినులను రాత్రి స‌మ‌యంలో వంట మనిషి ఓ అజ్ఞాత వ్యక్తి ఇంటికి తీసుకెళ్ల‌డం తీవ్ర క‌ల‌క‌లం రేపింది. వివ‌రాల్లోకి వెళ్తే.. జరుగుమల్లి కేజీబీవీలో వంట మ‌నిషిగా ప‌ని చేస్తున్న వ్య‌క్తికి డీఆర్‌డీఏలో ప‌ని చేసి రిటైర్ అయిన వెంక‌టేశ్‌తో ప‌రిచ‌యం ఉంది. వంట మ‌నిషి విద్యార్థినుల‌తో సాన్నిహిత్యం పెంచుకొని, వారిని మ‌భ్య‌పెట్టి రాత్రి స‌మ‌యంలో విద్యార్థుల‌ను ఒంగోలులోని వెంక‌టేశ్ ఇంటికి తీసుకెళ్లింది. అక్క‌డ అత‌డు విద్యార్థినుల‌తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడు. ఓ విద్యార్థిని భ‌యంతో కేక‌లు వేయ‌డంతో ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.

విద్యార్థినుల్లో ఒక‌రు భ‌యంతో బ‌య‌ట‌కు ప‌రుగులు తీసి స్థానికుల‌కు విష‌యం చెప్ప‌డంతో అంద‌రూ వెంక‌టేశ్ ఇంటిని చుట్టుముట్టారు. అలాగే విద్యార్థినుల త‌ల్లిదండ్రుల‌కు కూడా స‌మాచారం ఇచ్చారు. త‌ర్వాత పోలీసులు కూడా అక్క‌డికి చేరుకున్నారు. భ‌యంతో వెంక‌టేశ్ తలుపులు పెట్టుకొని లోప‌లే ఉన్నాడు. కొంత సేప‌టికి బ‌య‌ట‌కు వ‌చ్చి విద్యార్థినులు త‌న ద‌గ్గ‌ర‌కు డెత్ సర్టిఫికెట్ కోసం వ‌చ్చార‌ని సమాధానం చెప్పాడు. పొంత‌న లేని స‌మాధానాలు చెప్ప‌డంతో అంద‌రూ అత‌డిపై దాడి చేశారు. త‌ర్వాత పోలీసులు అత‌డిని అదుపులోకి తీసుకున్నారు. వంట మ‌నిషిని కూడా అరెస్ట్ చేశారు. స్థానికంగా ఈ ఘ‌ట‌న తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది. అస‌లు వంట మ‌నిషికి, వెంక‌టేశ్‌కు సంబంధం ఏమిటి? విద్యార్థినుల‌ను ఎప్ప‌టి నుంచి ఇలా తీసుకెళ్తున్నారు? గ‌తంలో ఇలాంటి ఘ‌ట‌న‌లు ఏమైనా జ‌రిగాయా అనే కోణంలో పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. కాగా, కేజీబీవీ యాజ‌మాన్యంపై విద్యార్థినుల త‌ల్లిదండ్రులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>