సీఎంతో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల భేటీ.. రేవంత్ కీలక సూచనలు!

కలం, సూర్యాపేట: నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఖరారైన రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) ని, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌‌గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ నివాసంలో ముందుగా ఆయనను కలిసిన సర్వోత్తమ్‌రెడ్డి, అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలసి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

తనను పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు పార్టీ అధిష్ఠానానికి, ముఖ్యమంత్రికి, టీపీసీసీ అధ్యక్షుడికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం, ఉమ్మడి జిల్లాల పరిధిలో గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు ప్రక్రియ, నియోజకవర్గాల వారీగా పార్టీ నాయకులతో సమన్వయం చేసుకోవడంపై అభ్యర్థి సర్వోత్తమ్‌రెడ్డికి ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు.

రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం, పీసీసీ అధ్యక్షుల సూచనల మేరకు ఉమ్మడి జిల్లాల పరిధిలోని కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముమ్మర ప్రచారంతో విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాంరెడ్డి కృష్ణారెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ కొండపల్లి దిలీప్‌రెడ్డిలతో పాటు పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>