కలం, వెబ్ డెస్క్ : సూర్యాపేట జిల్లా పరిధిలోని సూర్యాపేట- ఖమ్మం ప్రధాన రహదారిపై ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి (Suryapet Bus Accident) గురైంది. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న ప్రైవేట్ బస్సు మోతె మండలం హుస్సేనాబాద్ వద్ద అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది.
ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 38 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు బోల్తా పడటంతో ఐదుగురు ప్రయాణికులు గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు, వాహనదారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి బాధితులను బయటకు తీశారు. అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు.

