కలం, వెబ్ డెస్క్: కేంద్ర ఎన్నికల సంఘంలో జరుగుతున్న అన్ని ఉల్లంఘనలు ప్రధాని మోదీ(PM Modi)కి పూర్తిగా తెలుసని, అందుకే ఆయన రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ (KC Venugopal) డిమాండ్ చేశారు. సీడబ్ల్యూసీ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇద్దరు ఎన్నికల కమిషనర్లు సర్ విషయమై కేబినెట్ సెక్రటరీకి లేఖ రాశారంటేనే.. ప్రధాని మోదీకి పూర్తి సమాచారం ఉన్నట్లే కదా.. అని పేర్కొన్నారు.
కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్(Gyanesh Kumar)కు ఒక్క క్షణం కూడా ఆ పదవిలో కొనసాగే అవకాశం కూడా లేదని కేసీ వేణుగోపాల్ (KC Venugopal) విమర్శించారు. కాంగ్రెస్ సహా ఇండియా కూటమి నేతల మొదటి డిమాండ్ అదేనన్నారు. అంతేగాకుండా, సర్ ప్రక్రియను వెంటనే నిలిపేయాలన్నారు. తొలగించిన 13 కోట్ల ఓటర్లను తిరిగి పునరుద్ధరించాలన్నారు. జ్ఞానేష్ కుమార్ ఆటబొమ్మ అని.. అతడిని ముందు పెట్టి మోదీ, అమిత్ షా ఆడిస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
Also Read : నోరుజారి మాట్లాడితే మహిళలతో కొట్టిస్తాం.. కొండా సురేఖ మాస్ వార్నింగ్
Follow Us On: X(Twitter)

