తిరుపతిలో ఘోర ప్రమాదం: ముగ్గురు దుర్మరణం!

కలం, వెబ్ డెస్క్ : తిరుపతి నగరంలోని డి.బి.ఆర్ రోడ్డులో ఘోర ప్రమాదం (Tirupati Accident) చోటుచేసుకుంది. శ్రీకన్వెన్షన్ పక్కన ఉన్న స్థలంలో కొత్తగా చేపడుతున్న ఒక భవన నిర్మాణం కోసం సుమారు 30 అడుగుల మేర లోతైన పునాదులు తవ్వుతున్నారు. ఈ క్రమంలో మట్టిని తోడుతుండగా అనుకోకుండా భారీ క్రేన్ లోతైన పునాది గుంతలో పడిపోయింది.

ఈ ప్రమాదంలో అక్కడే పనిచేస్తున్న ముగ్గురు వ్యక్తులు మట్టి, మిషన్ కింద చిక్కుకుని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టినప్పటికీ తీవ్ర గాయాల కారణంగా వారిని కాపాడలేకపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల పూర్తి వివరాలపై దర్యాప్తు జరుపుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>