ఏటీఎం ఎత్తుకెళ్లేందుకు దొంగల ప్లాన్.. కానీ ఐదు నిమిషాల్లోనే!

కలం, వెబ్ డెస్క్ : ఏటీఎం మెషిన్‌ను ఎత్తుకెళ్తుందుకు (ATM Theft) యత్నించిన దుండుగలను పోలీసులు మెరుపు వేగంతో పట్టుకన్న ఘటన రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లా పరిధిలో చోటు చేసుకుంది. ఓ ఏటీఎం సెంటర్‌లోకి చొరబడిన దుండగులు.. మెషిన్‌లోని డబ్బును దొంగిలించడం కష్టమని భావించి, ఏకంగా ఏటీఎం మెషిన్‌నే పెకిలించి ఎత్తుకెళ్లేందుకు ప్లాన్ చేశారు. అయితే వారి ప్లాన్‌ ఎంత పక్కాగా ఉన్నా, బ్యాంక్ సెక్యూరిటీ సిస్టమ్ వారికి ఊహించని షాకిచ్చింది. మెషిన్‌ను కదిలించే యత్నం చేయగానే, ఆటోమేటిక్ సెక్యూరిటీ సిస్టమ్ ద్వారా బ్యాంక్ హెడ్ ఆఫీస్‌కు వెంటనే అత్యవసర ‘అలర్ట్’ వెళ్లింది.

రాత్రి వేళ అలర్ట్ రావడంతో వెంటనే అప్రమత్తమైన బ్యాంక్ సిబ్బంది, క్షణం కూడా ఆలస్యం చేయకుండా స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. కాల్ అందిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు మెరుపు వేగంతో ఏటీఎం వద్దకు చేరుకుని దొంగల ఆట కట్టించారు. దొంగలు మెషిన్‌ను కదిలించి బయటకు తీసే లోపే కేవలం ఐదు నిమిషాల్లోనే సంఘటనా స్థలానికి చేరుకుని నిందితులను చుట్టుముట్టి రౌండప్ చేశారు. దీంతో ఏటీఎంను ఎత్తుకెళ్లాలన్న దుండగుల కల చివరికి కటకటాల వెనక్కి నెట్టింది. ప్రస్తుతం నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. వారి వెను ఏమైనా గ్యాంగ్‌లు ఉన్నాయా? అనే కోణంలో విచారణ చేస్తున్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>