ఉప్పల్ – ఘట్‌కేసర్: మారనున్న మూసీ రూపురేఖలు!

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని మూసీ నది సమగ్ర ప్రాజెక్టు అభివృద్ధి దిశగా తెలంగాణ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని ఉప్పల్ నుంచి ఘట్‌కేసర్ వరకు సుమారు 21 కిలోమీటర్ల మేర మూసీ నది పరివాహక ప్రాంతాన్ని మోడరన్ రివర్‌ఫ్రంట్‌ (Musi Riverfront)గా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ భారీ ప్రాజెక్టు పనుల నిమిత్తం ఏకంగా 2,000 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించి, దీనికి సంబంధించిన ఉత్తర్వులను (GO) ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది.

ఈ 21 కిలోమీటర్ల పరిధిలోని అభివృద్ధి పనుల కోసం మొత్తం రూ.7,345 కోట్ల అంచనా వ్యయంతో ప్రణాళికలు రూపొందించారు. త్వరలోనే క్షేత్రస్థాయిలో భూసేకరణ ప్రక్రియ వేగవంతం కానుంది. ఈ సేకరణ కార్యక్రమంలో భాగంగా నిబంధనలకు అనుగుణంగా ప్రైవేట్ పట్టా భూములతో పాటు, నది పరివాహక ప్రాంతంలోని ఎఫ్‌టీఎల్ భూములు, బఫర్ జోన్ భూములు, ఆక్రమణలకు గురైన భూములను ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకోనుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>