పాల్వంచ డబుల్ బెడ్‌రూమ్ కేటాయింపుల్లో అక్రమాలు: కనకేష్

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ నవభారత్ ఏరియాలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు తీవ్ర అక్రమాలకు పాల్పడుతున్నారని పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్ ( Kampelli Kanakesh Patel) ఆరోపించారు. ​సోమవారం పాల్వంచలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2023లో అప్పటి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, అధికారుల సమక్షంలో పారదర్శకంగా డ్రా తీసి, తహసీల్దార్ కార్యాలయ నోటీస్ బోర్డులో ప్రదర్శించిన 380 మంది లబ్ధిదారులను ఎలాంటి నోటీసూ ఇవ్వకుండా పక్కన పెట్టడం దారుణమన్నారు.

అసంపూర్తిగా ఉన్న ఇళ్లను పూర్తి చేయకుండా, ఇటీవల పెద్దమ్మ గుడి వద్ద కొత్తగా 360 మందికి డ్రా తీయడం వెనుక రాజకీయ కుట్ర ఉందని కనకేష్ మండిపడ్డారు. వెంటనే కొత్త డ్రాను రద్దు చేసి, పాత 380 మంది అర్హులకే ఇళ్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించకపోతే బాధితులతో కలిసి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో నాయకులు మారుమూళ్ల కిరణ్, పూజల ప్రసాద్, కాంపెల్లి నవీన్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>