కలం, నిర్మల్ : ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ నిర్మల్ (Indian Red Cross Society Nirmal) జిల్లా శాఖ మేనేజింగ్ కమిటీ ఎన్నికలు సోమవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రశాంతంగా జరిగాయి. మొత్తం 15 మంది సభ్యులు కోరంతో ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నారు. చైర్మన్ పదవికి యాటకారి సాయన్న, గొజ్జ జనార్దన్ పోటీ చేయగా, అత్యధిక మెజార్టీతో గొజ్జ జనార్దన్ చైర్మన్‌గా గెలుపొందారు.
వైస్ చైర్మన్‌గా ఎంసీ లింగన్న, కోశాధికారిగా అల్లాడి రవి ఎన్నికయ్యారు. స్టేట్ మేనేజింగ్ కమిటీ సభ్యుడిగా సామనపల్లి రాఘవులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారి, జిల్లా కో-ఆపరేటివ్ అధికారి కె. సత్యనారాయణ ఎన్నికల ఫలితాలను వెల్లడించారు. ఈ ఎన్నికల ప్రక్రియలో సహాయ ఎన్నికల అధికారి శరత్‌బాబు, సహాయకులు సాయందర్, సిబ్బంది పాల్గొన్నారు. నూతన మేనేజింగ్ కమిటీ సభ్యులను పలువురు అభినందించారు.

