ఐలమ్మ స్ఫూర్తితో ప్రజా హక్కుల కోసం పోరాడుతాం: కూసుమంట్ల ప్రభాకర్ రెడ్డి

కలం, మునుగోడు: చాకలి ఐలమ్మ చూపిన పోరాట మార్గం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని, అదే స్ఫూర్తితో రైతులు, కార్మికులు, సామాన్య ప్రజల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడుతామని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి (Kusukuntla Prabhakar Reddy) అన్నారు. సోమవారం చండూరు మండలంలోని నేర్మట గ్రామం (Nermata Village) లో చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

నాగిళ్ల శంకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణ రైతాంగ పోరాట చరిత్రలో చాకలి ఐలమ్మ పేరు చిరస్థాయిగా నిలిచిపోయిందని ఆయన పేర్కొన్నారు. భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా ఆమె చేసిన పోరాటం నేటికీ ప్రజా ఉద్యమాలకు మార్గదర్శకంగా నిలుస్తోందన్నారు. మునుగోడు ప్రాంత రైతుల సాగునీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, డిండి ప్రాజెక్టు నీటిని పూర్తిస్థాయిలో అందించేందుకు అవసరమైన పోరాటం కొనసాగిస్తానని తెలిపారు.

ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టులు, రైతుల సమస్యల పరిష్కారంపై ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. రాజకీయాలకు అతీతంగా ప్రజా సమస్యల పరిష్కారానికి అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.

ముఖ్యమంత్రి వద్ద ఉన్న పలుకుబడిని నియోజకవర్గ అభివృద్ధికి వినియోగించాలని, ప్రజలకు స్పష్టమైన ఫలితాలు కనిపించేలా కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. మాటలకే పరిమితం కాకుండా అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని కోరారు. మునుగోడు ఎమ్మెల్యేకు మంత్రి పదవి మీద ఉన్న ధ్యాస నియోజకవర్గ అభివృద్ధిపై లేదన్నారు. సాగునీరు, రైతుల సమస్యలు, అభివృద్ధి నిధుల వంటి అంశాలపై రాజకీయలతీతంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో చండూరు మాజీ ఎంపీపీ, మాజీ మున్సిపల్ చైర్మన్ తోకల చంద్రకళ వెంకన్న, చాకలి ఐలమ్మ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐత రాజు లక్ష్మణ్, రాష్ట్ర ఫౌండర్ చైర్మన్ నాగిళ్ల శంకర్, రాష్ట్ర కోఆర్డినేటర్ పగిళ్ల సందీప్, సీపీఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనుంజయ, బీఆర్ఎస్ నాయకులు యత్తపు మధుసూదన్ రావు, పాల్వాయి రమాదేవి, శ్రవణ్ కుమార్ రెడ్డి, ఉజ్జిని అనిల్ రావు, పెద్దగోని వెంకన్న, కొత్తపాటి సతీష్, తెలుకుంట్ల చంద్రశేఖర్, బొడ్డు సతీష్, మహనీయుల ఫ్రంట్ మునుగోడు నియోజకవర్గ అధ్యక్షులు నారపాక ఆంజనేయులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షులు నెల్లికంటి రాఘవేందర్ యాదవ్, భీమరాజు నర్సింగ్, తల్వార్ తాత టీవీ వ్యవస్థాపకులు కొప్పు సంజీవ, ఏఐటీయూసీ చండూరు మండల అధ్యక్షులు భూతరాజు దేవయ్య, బుర్కల వెంకన్న, గ్రామ సర్పంచ్ నారపాక వసంత ధనయ్య, మాజీ సర్పంచులు నందికొండ నరసింహారెడ్డి, నారపాక శంకర్, బుర్కల శ్రీనివాస్, ఈరటి వెంకటయ్య, బల్లెం స్వామి, చాకలి ఐలమ్మ సంఘం గ్రామ నాయకులు రావుల మల్లయ్య, లక్ష్మణ్, శంకర్, వెంకన్న, నాగిళ్ల యాదయ్య, నాగిళ్ల రామలింగం, దశరథ, వివిధ ప్రజాసంఘాల నాయకులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>