కలం, నిర్మల్ : నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జోనల్ స్థాయి అండర్ 14, అండర్ 17 రగ్బీ క్రీడాకారుల ఎంపిక పోటీలు సోమవారం నిర్వహించారు. ఈ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. అండర్ 14 విభాగంలో ఎంపికైన క్రీడాకారులు నిర్మల్ లో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో, అండర్ 17 విభాగంలో ఎంపికైన వారు రంగారెడ్డి జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని ఎస్జీఎఫ్ సెక్రటరీ లక్ష్మణ్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో రగ్బీ అసోసియేషన్ అధ్యక్షుడు విద్యాసాగర్, కార్యదర్శి భూమేష్, టీజీపేట కార్యదర్శి వన్నెల భూమన్న, కోశాధికారి నచ్చేందర్, జాయింట్ సెక్రటరీ పోశెట్టి, కార్యదర్శి అన్నపూర్ణ, సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు రమణారావు, బుచ్చి రామారావు, పలువురు వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

