ఆకస్మిక తనిఖీ.. బాలికల కాలు పట్టుకొని పరీక్షించిన కలెక్టర్

కలం, జనగామ: జిల్లాలోని పాలకుర్తి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థులను ఎలుకలు కరిచినట్లు వచ్చిన సమాచారంపై జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ (Collector Sandeep Kumar Jha) ఝా సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు.

విద్యార్థుల చేతులు, కాళ్లను స్వయంగా పరిశీలించిన కలెక్టర్.. ఎలుకలు కరిచినట్లు ఎలాంటి ఆనవాళ్లు, గాయాలు లేదా గీతలు కనిపించలేదని తెలిపారు. విద్యార్థులు కూడా తమకు జ్వరం, నొప్పి లేదని, రక్తస్రావం జరగలేదని, భోజనం బాగానే ఉంటోందని కలెక్టర్‌కు వివరించారు. ఈ నేపథ్యంలో వదంతులను నమ్మవద్దని కలెక్టర్ సూచించారు.

అనంతరం భోజన గది, వంటశాల, సరుకుల నిల్వ గది, మరుగుదొడ్లు, విద్యార్థుల పడక గదులను పరిశీలించారు. పాఠశాల పరిసరాల్లో పరిశుభ్రతపై పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డిపై అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్.. పనికిరాని వస్తువులను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.

విద్యార్థులకు నాణ్యమైన, శుభ్రమైన పౌష్టికాహారం అందించాలని, తాజా కూరగాయలతో ఆహారం తయారు చేయాలని సూచించారు. అనుమతి లేకుండా బయటి వ్యక్తులను పాఠశాలలోకి అనుమతించవద్దని స్పష్టం చేశారు. పాఠశాలలను ఎంపీడీఓ, తహసీల్దార్లు క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ కిరణ్ ప్రకాశ్, తహసీల్దార్ సరస్వతి, ఎంపీడీఓ వేదవతి, వైస్ ప్రిన్సిపాల్ వరలక్ష్మి, ఉపాధ్యాయులు, సిబ్బంది ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>