గ్రామాల సమగ్ర అభివృద్ధే లక్ష్యం : కొత్త ప్రభాకర్ రెడ్డి

కలం, మెదక్ బ్యూరో : దుబ్బాక నియోజకవర్గంలోని గ్రామాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా అవసరమైన మౌలిక వసతులను కల్పించేందుకు కృషి చేస్తున్నామని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి (Kotha Prabhakar Reddy) అన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో పలు గ్రామాల్లోని అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా కొత్త ప్రభాకర్ రెడ్డి (Kotha Prabhakar Reddy) మాట్లాడుతూ.. రహదారులు, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తామని చెప్పారు. పంచాయతీ భవనాలు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా అభివృద్ధి పనులను కొనసాగిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>