బైక్‌ కోసం బాసర గోదావరి బ్రిడ్జిపై యువకుడి హల్‌చల్‌..!

కలం, బాసర : బైక్‌ కొనివ్వాలని కుటుంబ సభ్యులతో గొడవపడిన ఓ యువకుడు గోదావరి నదిలో దూకుతానంటూ బాసర గోదావరి బ్రిడ్జి (Basara Godavari Bridge) పై హల్‌చల్‌ చేశాడు. ఎస్‌హెచ్‌ఓ దీపక్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్‌ జిల్లా నవీపేట్‌ మండల కేంద్రానికి చెందిన నవీన్‌ అనే యువకుడు బాసర గోదావరి బ్రిడ్జిపైకి వచ్చి ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరింపులకు దిగాడు. బైక్‌ కొనిస్తామని కుటుంబ సభ్యులు హామీ ఇచ్చే వరకు బ్రిడ్జి నుంచి దిగనని పట్టుబట్టాడు.

ఈ విషయాన్ని గమనించిన వాగ్దేవి సొసైటీ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, స్థానికులు అక్కడికి చేరుకుని నవీన్‌కు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అదే సమయంలో కుటుంబ సభ్యులను సంప్రదించి మాట్లాడారు. బైక్‌ కొనిస్తామని కుటుంబ సభ్యులు హామీ ఇవ్వడంతో నవీన్‌ శాంతించాడు. అప్రమత్తంగా వ్యవహరించిన పోలీసులు, సిబ్బంది వెంటనే నవీన్‌ను బ్రిడ్జిపైకి లాగి సురక్షితంగా రక్షించారు. అనంతరం అతడిని పోలీస్‌స్టేషన్‌కు తరలించి కౌన్సెలింగ్‌ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>