వివాహేతర సంబంధం.. యువకుడి దారుణ హత్య

​కలం, కరీంనగర్ బ్యూరో: వివాహేతర సంబంధం (Extramarital Affair) నెపంతో ఒక యువకుడిని దారుణంగా నరికి చంపిన ఘటన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ (Huzurabad) పట్టణ శివారులో తీవ్ర కలకలం రేపింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం వివరాల్లోకి వెళ్తే… ​హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పులపల్లె గ్రామానికి చెందిన వడిగె రాకేష్ (32)కు, అతని సమీప బంధువు (వరుసకు మామ అయిన) అదే గ్రామానికి చెందిన అంబరగొండ ప్రశాంత్ భార్య సోనీకి మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు సమాచారం.

గత ఆగస్టు 15న భీమారంలోని ఓ లాడ్జిలో వీరు రెడ్ హ్యాండెడ్‌గా దొరకడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వివాదం చెలరేగింది. పలుమార్లు పంచాయితీలు జరగడం, పోలీస్ స్టేషన్ వరకు వ్యవహారం వెళ్లడంతో సోనీ తన భర్తను వదిలేసి పుట్టినిల్లు ఆరేపల్లికి వెళ్ళిపోయింది. అక్కడ ఉంటూ కూడా రాకేష్‌తో సంబంధం కొనసాగిస్తుండటంతో, తన ప్రాణాలకు ముప్పు ఉందని భావించిన రాకేష్ ఊరు విడిచి హనుమకొండలో గుట్టుగా నివాసముంటున్నాడు.

​కో వర్టుతో స్కెచ్.. మద్యం తాపించి ఘాతూకం

గత రెండు నెలలుగా రాకేష్‌పై రెక్కీ నిర్వహించిన ప్రశాంత్, ఎలాగైనా అతని అడ్డు తొలగించుకోవాలని పక్కా వ్యూహం రచించాడు. అందుకోసం తన హార్వెస్టర్ డ్రైవర్‌ను రాకేష్‌ వద్దకు కోవర్టుగా పంపాడు. పథకం ప్రకారం ఆ డ్రైవర్ రాకేష్‌ను నమ్మించి ఆదివారం రాత్రి హనుమకొండ నుంచి బైక్‌పై హుజూరాబాద్‌(Huzurabad)కు తీసుకువచ్చాడు. స్థానిక పెద్ద మోరీ సమీపంలోని ఒక బార్‌లో రాకేష్‌కు విపరీతంగా మద్యం తాపించి, ఆపై ప్రశాంత్‌కు సమాచారం అందించాడు. ​

మద్యం మత్తులో ఉన్న రాకేష్‌ను పెద్దపాపయ్యపల్లికి వెళ్లే దారిలోని కెసి క్యాంప్ శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ (SRSP) కెనాల్ బ్రిడ్జి వద్దకు తీసుకెళ్లారు. అక్కడ ప్రశాంత్ మరికొందరితో కలిసి వెంట తెచ్చుకున్న కత్తితో రాకేష్‌పై విచక్షణారహితంగా దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని ఎస్సారెస్పీ కాలువలో పడేసి అక్కడి నుంచి పరారయ్యారు.

పోలీసుల దర్యాప్తు వేగవంతం

హత్య అనంతరం నిందితులు మొదట కమలాపూర్ పోలీసులకు సమాచారం ఇవ్వగా ఆ ప్రాంతం హుజూరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి రావడంతో హుజూరాబాద్ పోలీసులకు అప్పగించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయాన్ని అధికారులు ఇంకా అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీమ్ ద్వారా వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఈ హత్యలో ప్రశాంత్‌తో పాటు భాగస్వాములైన ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకైన రాకేష్ దారుణ హత్యకు గురవడంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 24 గంటల్లో మిస్టరీని ఛేదించేందుకు దర్యాప్తును ముమ్మరం చేశారు.

Also Read : భారత్-నేపాల్ సరిహద్దులో భూకంపం.. భయాందోళనలో ప్రజలు!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>