ప్రజావాణి దరఖాస్తులపై అదనపు కలెక్టర్ ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు!

కలం, నిర్మల్: ప్రజావాణి (Prajavani) దరఖాస్తుల పరిష్కారంలో అలసత్వం వహించవద్దని జిల్లా ఇంచార్జి అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) రాథోడ్‌ రమేష్‌ (Rathod Ramesh) అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్మల్‌ (Nirmal) జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు.

ఈ సందర్బంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, సమస్యల పరిష్కారానికి అధికారులు తక్షణమే స్పందించాలని సూచించారు. మండలాల వారీగా పెండింగ్‌లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులను సమీక్షించి, ఆయా సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్‌ రాకేష్‌, ఆర్డీవో దేవీదాస్‌, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>