అమెరికాలో ఘోరం: బర్త్ డే పార్టీలో విచక్షణారహిత కాల్పులు

కలం, వెబ్ డెస్క్ : అమెరికాలోని జార్జియా రాష్ట్రం మేకాన్ (Macon Shooting) నగరంలో అర్ధరాత్రి వేళ భారీ తుపాకీ కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. ఒక యువతి 18వ పుట్టినరోజు వేడుకను జరుపుకోవడానికి పలువురు యువతీ, యువకులు స్థానిక కరోలిన్ క్రేటన్ పార్క్‌కు చేరుకున్న సమయంలో ఈ దారుణం జరిగింది. వేడుక జరుగుతుండగా అక్కడికి వచ్చిన మరో బృందంతో తీవ్ర వివాదం చెలరేగడంతో, ఇరువర్గాలు ఆయుధాలు తీసి పరస్పరం విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాయి.

సుమారు 30 సెకన్ల పాటు సాగిన ఈ రణరంగంలో తుపాకుల మోతకు ప్రాణాలు దక్కించుకునేందుకు భయాందోళనతో జనం చెల్లాచెదురుగా పరుగులు తీశారు. ఈ ఘోర ప్రమాదంలో 17 నుంచి 19 ఏళ్ల వయస్సు గల 12 మంది టీనేజర్లు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే స్థానికులు, సహాయక సిబ్బంది ప్రైవేట్ వాహనాల్లో సమీప ఆస్పత్రులకు తరలించారు. బాధితుల్లో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం అందుతోంది.

మొదట అద్దె ఇంట్లో ప్రారంభమైన ఈ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాతే పార్కులో ఈ ఘర్షణ చోటుచేసుకుందని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. స్థానిక బిబ్ కౌంటీ షెరీఫ్ డేవిడ్ డేవిస్ ఘటనపై స్పందిస్తూ కేసు నమోదు చేసి తీవ్ర స్థాయిలో దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. పార్కులోని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించడంతో పాటు ఘటనా స్థలంలో ఉన్న వాహనాలను స్వాధీనం చేసుకుని, పలువురు ప్రత్యక్ష సాక్షులను విచారిస్తున్నారు. నిందితులను త్వరలోనే గుర్తించి కఠినంగా శిక్షిస్తామని, ఆ ప్రాంతంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశామని అధికారులు వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>