కలం, వెబ్ డెస్క్ : బ్యాంకు ఉద్యోగులు చేపట్టనున్న సమ్మె(Bank Employees Strike) వాయిదా పడింది. బ్యాంకుల అసోసియేషన్, ఉద్యోగ సంఘాల ప్రతినిధుల మధ్య జరిగిన చర్చల అనంతరం సమ్మెను వాయిదా వేస్తున్నట్లు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) ప్రకటించింది. ఇవాళ, రేపు, ఎల్లుండి మూడు రోజుల పాటు నిర్వహించాల్సిన సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా బ్యాంకులు యథావిధిగా పనిచేయనున్నాయి. బ్యాంకింగ్ సేవలకు అంతరాయం లేకుండా సాధారణ కార్యకలాపాలు కొనసాగనున్నాయి. బ్యాంకుల అసోసియేషన్, యూనియన్ల మధ్య జరిగిన చర్చల్లో పలు అంశాలపై చర్చ జరిగిన అనంతరం సమ్మె వాయిదా నిర్ణయం తీసుకున్నట్లు UFBU వెల్లడించింది.

