కాక్రోచ్ జనతా పార్టీకి పోలీసులు భారీ షాక్

కలం, వెబ్ డెస్క్: కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janta Party)కి ముంబయి పోలీసులు షాక్ ఇచ్చారు. అక్టోబర్ రెండో తేదీన నిర్వహించబోయే ఆందోళన కార్యక్రమానికి అనుమతి నిరాకరించారు. ఆ రోజు గాంధీ జయంతి కావడంతో పాటు నిరసనల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందనే సమాచారం నేపథ్యంలోనే అనుమతి నిరాకరిస్తున్నట్లు తెలిపారు. దీనిపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్వేచ్చగా నిరసన తెలిపే గొంతులను నొక్కే ప్రయత్నం చేయొద్దని అభిజిత్ దీప్కే (Abhijit Dipke) సూచించారు. తమను అడ్డుకుంటే.. జైల్లోనే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలంటూ సీజేపీ ఇప్పటికే డెడ్ లైన్ కూడా విధించింది. అది ముగిసిన నేపథ్యంలో ముంబయిలో భారీ ఆందోళన చేపట్టాలని భావిస్తోంది.

అసోం ప్రభుత్వానికి హెచ్చరిక..

కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janta Party) నాయకుడు అశుతోష్ రంకాను అసోం పోలీసులు అరెస్ట్ చేయడంపై అభిజిత్ దీప్కే మండిపడ్డారు. శనివారం ఉదయం ఆయన్ను అదుపులోకి తీసుకున్నారని.. ఇంతవరకు ఎక్కడున్నాడో చెప్పడం లేదన్నారు. లాయర్లు కలుద్దామన్నా అనుమతించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అశుతోష్ రంకా, ఇతర నాయకులను రహస్య ప్రాంతానికి తరలించినట్లు తమకు తెలుస్తోందని.. ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. అసోంలో వాలంటీర్ల సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్తుంటే.. వచ్చిన ఇబ్బందేంటన్నారు. తాను రేపు అసోం వెళ్తున్నానని.. ఇలాంటి బెదిరింపులకు భయపడబోమన్నారు. తనను అరెస్ట్ చేసి జైల్లో వేసుకోవచ్చని.. ఎయిర్ పోర్టులోనే ఆ పని చేయండి అంటూ సవాల్ విసిరారు.

Also Read : కాంగ్రెస్ పాలనలో రూ.12 లక్షల కోట్ల అవినీతి: అమిత్ షా

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>