మన్‌కీబాత్‌ కార్యక్రమాన్ని వీక్షించిన ఎమ్మెల్యే ఏలేటి

కలం, నిర్మల్: దేశ ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన మన్‌కీబాత్‌ (Mann Ki Baat) 138వ కార్యక్రమాన్ని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆదివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలతో ప్రధాని మోదీ తన ఆలోచనలు, దేశాభివృద్ధికి సంబంధించిన అంశాలను పంచుకునే మన్‌కీబాత్‌ కార్యక్రమానికి ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు.

దేశంలో జరుగుతున్న అనేక అభివృద్ధి, సామాజిక కార్యక్రమాలను ఈ వేదిక ద్వారా ప్రధాని (PM Modi) ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. అక్టోబర్ 7 నాటికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి పదవుల్లో కలిపి 25 సంవత్సరాల ప్రజాసేవను పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ‘సేవా సంకల్ప అభియాన్’ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

పదవుల కోసం కాకుండా ప్రజా సేవే లక్ష్యంగా ప్రధాని మోదీ పనిచేస్తున్నారని ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) అన్నారు. దేశ అభివృద్ధి కోసం ప్రధాని మోదీ చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలంతా అండగా నిలవాలని నిర్మల్ ఎమ్మెల్యే కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>