మంత్రి సీతక్క శుభవార్త.. గ్రామాలకు భారీగా నిధులు

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలోని గ్రామాలకు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క (Minister Seethakka) భారీ శుభవార్త చెప్పారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న గ్రామ పంచాయతీల భవనాల నిర్మాణానికి ఒకేసారి రూ.1,000 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 5,118 పంచాయతీల్లో ఇప్పటికే 70 శాతం పైగా గ్రామాల్లో నిర్మాణ పనులు కూడా ప్రారంభమైనట్లు వివరించారు.

అంతేగాకుండా, 8 వేల గ్రామాల్లోని మహిళా స్వయం సహాయక సంఘాల కేంద్రాల కోసం రూ.800 కోట్లు మంజూరు చేస్తున్నట్లు మంత్రి సీతక్క ప్రకటించారు. వీటితో స్వయం సహాయక కేంద్రాల్లో భవనాల నిర్మాణం, ఇతరత్ర అవసరాలకు ఉపయోగించుకోవచ్చన్నారు. ఇక రూ.3,382 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో హ్యామ్ రోడ్లను నిర్మించబోతున్నట్లు ప్రకటించారు. సుమారు 3,800 కిలోమీటర్ల రహదారులను హ్యామ్ రోడ్ల పథకంలో భాగంగా నిర్మించబోతున్నామని వివరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>