కలం, కరీంనగర్: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రజాజీవితంలో 25 సంవత్సరాలు విజయవంతంగా పూర్తిచేసుకున్న శుభసందర్భాన్ని పురస్కరించుకుని, సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా భారతీయ జనతా యువ మోర్చా (BJYM) కరీంనగర్ (Karimnagar) శాఖ ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ , బీజేపి రాష్ట్ర అధికార ప్రతినిధి డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ.. దేశ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే పరమావధిగా అహర్నిశలు శ్రమిస్తూ, 25 ఏళ్లుగా ప్రజాసేవలో కొనసాగుతున్న ప్రధాని నరేంద్ర మోడీ మార్గనిర్దేశనంలో దేశం అన్ని రంగాల్లో దూసుకుపోతోందని కొనియాడారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా యువత సామాజిక సేవలో ముందంజలో ఉండాలని పిలుపునిచ్చారు.
ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడే రక్తదానం అత్యంత పవిత్రమైన కార్యక్రమం అని, ఇటువంటి సేవా కార్యక్రమాన్ని నిర్వహించిన బీజేవైఎమ్ కరీంనగర్ ప్రతినిధులను, కార్యకర్తలను అభినందించారు. ఈ రక్తదాన శిబిరంలో పెద్ద సంఖ్యలో యువకులు, బీజేవైఎమ్ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు గుజ్జ శ్రీనివాస్, చొప్పరి జయశ్రీ, పొన్నం మొండయ్య, మాసం గణేష్, గాజె శివరాం, ఎన్నం ప్రకాష్, బీజీపీ జోన్ అధ్యక్షులు అవదుర్తి శ్రీనివాస్, తణుకు సాయికృష్ణ, పాదం శివరాజ్ బండారి గాయత్రి, బీజేపీ నాయకులు చంద్రమౌళి, చాడ ఆనంద్, గర్థస్ సతీష్, అడిచెర్ల రాజు, గుంజెటి శివకుమార్, పండుగ నాగరాజు, నక్క ప్రమోద్, కడర్ల విమల్ కుమార్, వెంకటేష్ అన్నాజీ, వీనీత్ గున్నాల, కన్నంబ అరుణ్, తదితరులు పాల్గొన్నారు.

