కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త మడుగుల దీప్తి రెడ్డి (Deepthi Reddy) బ్రెయిన్ డెడ్ కావడంతో, ఆమె కుటుంబ సభ్యులు అవయవ దానానికి ముందుకు వచ్చి సమాజానికి ఆదర్శంగా నిలిచారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఆమెకు వైద్యులు బ్రెయిన్ డెడ్ అని ధృవీకరించిన అనంతరం, కుటుంబ సభ్యులు ఆమె ఆకాంక్ష మేరకు అవయవ దానానికి సమ్మతి తెలిపారు.
విరాట్ ఫౌండేషన్ (Virat Foundation) సహకారంతో జీవన్‌దాన్ సంస్థ ద్వారా ఈ అధికారిక ప్రక్రియను పూర్తి చేశారు. గతంలోనే అవయవ దానానికి ప్రతిజ్ఞ చేసిన దీప్తి రెడ్డి (Deepthi Reddy) నిర్ణయాన్ని, పుట్టెడు దుఃఖంలోనూ గౌరవించిన కుటుంబ సభ్యుల ఉదారతను విరాట్ ఫౌండేషన్ అధ్యక్షుడు యష్ వీరగోని కొనియాడారు. ఈ గొప్ప నిర్ణయం మరికొంతమంది జీవితాల్లో వెలుగులు నింపుతుందని, ప్రజల్లో అవయవ దానంపై మరింత అవగాహన పెరగాలని ఆయన పిలుపునిచ్చారు.
Also Read : లవ్లీ యూనివర్సిటీలో అర్ధరాత్రి రచ్చ రచ్చ.. అసలు ఏం జరిగిందంటే?
Follow Us On: X(Twitter)

